ఈ బ్యూటీ ఆశలన్నీ 'ఈటి' పైనే!

ET movie update
  • 'నానీస్ గ్యాంగ్ లీడర్'తో పరిచయం 
  • నిరాశపరిచిన 'శ్రీకారం' 
  • సక్సెస్ తెచ్చిపెట్టిన 'డాక్టర్'
  • ఈ నెల 10న రానున్న 'ఈటి'
తెలుగు తెరకి పరిచయమైన అందమైన కథానాయికలలో ప్రియాంక మోహన్ ఒకరు. కన్నడ సినిమాతో తన కెరియర్ ను మొదలుపెట్టిన ఆమె, 'నానీస్ గ్యాంగ్ లీడర్' సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ తరువాత శర్వానంద్ జోడీగా 'శ్రీకారం' సినిమాలోను నటించింది. రెండు సినిమాలు విభిన్నమైన జోనర్లకు సంబంధించినవే. 

ప్రియాంక మోహన్ గ్లామర్ కి .. నటనకు మంచి మార్కులు పడ్డాయిగానీ, రెండు సినిమాలు కూడా అంతంత మాత్రంగానే ఆడాయి. దాంతో సహజంగానే ఆమెకి అవకాశాలు రాలేదు. ఈ నేపథ్యంలోనే ఆమె కోలీవుడ్ కి వెళ్లి అక్కడ శివకార్తికేయన్ జోడీగా 'డాక్టర్'లో  ఛాన్స్ దక్కించుకుంది. ఈ సినిమా చాలా వేగంగా 100 కోట్ల జాబితాలో చేరిపోయింది. 

ప్రియాంక మోహన్ తన కెరియర్ లో సాధించిన ఫస్టు హిట్ అదే. ఆ తరువాత సినిమాగా ఆమె సూర్య సరసన చేసిన 'ఈటి' ఈ నెల 10వ తేదీన థియేటర్లకు రానుంది. ఇది పాన్ ఇండియా సినిమా .. అందువలన ఈ సినిమాపై ఈ బ్యూటీ ఆశలు పెట్టుకుంది. ఈ సినిమా హిట్ అయితే తెలుగుతో పాటు మిగతా భాషల నుంచి కూడా అవకాశాలు వస్తాయనే నమ్మకంతో ఉంది. ఆమె నిరీక్షణ ఫలిస్తుందేమో చూడాలి మరి!
Go Back to Shorts
Surya
Priyanka Mohan
ET Movie

More Telugu News