తెలంగాణలో 151 మందికి కరోనా పాజిటివ్... తాజా బులెటిన్ ఇదిగో!
- గత 24 గంటల్లో 18,881 కరోనా పరీక్షలు
- జీహెచ్ఎంసీ పరిధిలో 68 కొత్త కేసులు
- ఇంకా 3,237 మందికి చికిత్స
రాష్ట్రంలో ఇప్పటిదాకా 7,88,775 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,81,427 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,237 మంది చికిత్స పొందుతున్నారు. తెలంగాణలో ఇప్పటివరకు కరోనాతో 4,111 మంది మరణించారు.
