రష్యాపై ఆగ్రహం.. సైన్యాన్ని పంపిస్తున్న కెనడా!
- రష్యాకు వ్యతిరేకంగా ఏకమవుతున్న పలు దేశాలు
- ఆర్థిక ఆంక్షలు విధిస్తున్నట్టు తెలిపిన కెనడా
- రష్యాను ఆర్థికంగా ఒంటరిని చేస్తామన్న కెనడా ప్రధాని
అంతేకాదు, తూర్పు ఐరోపా ప్రాంతంలోకి నాటో బలగాలకు దన్నుగా వందలాది సైనిక బలగాలను పంపిస్తున్నట్టు వెల్లడించింది. లాత్వియా సహా పరిసర ప్రాంతాల్లోకి 460 మంది సభ్యులతో కూడిన సాయుధ బలగాలను పంపుతున్నట్టు కెనడా ప్రధాని ట్రూడో తెలిపారు. రష్యాను ఆర్థికంగా ఒంటరిని చేసేందుకు మిత్ర దేశాలతో కలిసి చర్యలు తీసుకుంటామని చెప్పారు.