పెనుగొండలో మహిళా కానిస్టేబుల్ కు సీమంతం చేసిన ఇతర పోలీసులు
- పశ్చిమ గోదావరి జిల్లాలో ఘటన
- గర్భం ధరించిన కానిస్టేబుల్ లీలారాణి
- పోలీస్ స్టేషన్ లోనే సీమంతం
- హాజరైన సీఐ, ఎస్సై
ఆ మహిళా కానిస్టేబుల్ పేరు లీలారాణి. ప్రసవ సమయం సమీపిస్తుండడంతో ఆమెకు పోలీస్ స్టేషన్ లోనే సీమంతం చేశారు. లీలారాణి సీమంతం కోసం పోలీస్ స్టేషన్ ను అందంగా ముస్తాబు చేశారు. ఆశీస్సుల కోసం ముత్తయిదువలు, పేరంటాళ్లను కూడా ఆహ్వానించారు. ఈ సీమంతం పనులను పెనుగొండ సీఐ నాగేశ్వరరావు, ఎస్సై మోహన్ రావు స్వయంగా పర్యవేక్షించడం విశేషం.