సిరిసిల్లలో బాలకృష్ణ షూటింగ్ ప్రారంభం!
- సెట్స్ పైకి వెళ్లిన బాలకృష్ణ
- కెరియర్ పరంగా ఇది 107వ సినిమా
- రాయలసీమ నేపథ్యంలో సాగే కథ
- గోపీచంద్ మలినేని దర్శకత్వం
- కథానాయికగా శ్రుతి హాసన్
క్రితం ఏడాది గోపీచంద్ మలినేని 'క్రాక్' సినిమాతో హిట్ ఇచ్చాడు. ఆ సినిమా చూసిన బాలయ్య ఆయనను పిలిచిమరీ ఛాన్స్ ఇచ్చారు. బాలయ్య ఇంతకుముందు రాయలసీమ నేపథ్యంలో చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ హిట్స్ అనిపించుకున్నాయి. అందువలన అదే నేపథ్యంలో గోపీచంద్ మలినేని కథను రెడీ చేసుకున్నాడు.
'వేటపాలెం'లో జరిగిన ఒక సంఘటన చుట్టూ ఈ కథ తిరగనున్నట్టు చెప్పుకుంటున్నారు. బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేయనున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. 'అఖండ' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత బాలయ్య చేస్తున్న సినిమా కావడంతో సహజంగానే అంచనాలు ఒక రేంజ్ లో ఉంటాయి. మరి ఆ అంచనాలను గోపీచంద్ మలినేని ఎంతవరకూ అందుకుంటాడనేది చూడాలి.