ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు మరో భారీ షాక్.. 46 ఏళ్ల బంధాన్ని తెంచుకున్న కేంద్ర మాజీ మంత్రి అశ్వనీకుమార్!
- సోనియాగాంధీకి రాజీనామా లేఖ
- కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో మరింత దిగజారిపోతుందన్న అశ్వనీకుమార్
- అధినేతగా చెప్పుకుంటున్న వ్యక్తికి ప్రజల నుంచి ఆమోదం లభించడం లేదంటూ వ్యాఖ్య
- తాను ఏ పార్టీలోనూ చేరాలనుకోవడం లేదని స్పష్టీకరణ
భవిష్యత్తులో ఆ పార్టీ మరింతగా దిగజారే అవకాశం ఉందన్నారు. పార్టీ అధినేతగా చెప్పుకుంటున్న వ్యక్తికి ప్రజల ఆమోదం లభించడం లేదన్నారు. ప్రధాని మోదీ పనితీరు విషయంలో ప్రజలు సంతృప్తిగా లేకపోయినప్పటికీ కాంగ్రెస్‌కు ఎందుకు ఓటు వేయడం లేదన్న ప్రశ్న పదేపదే ఉత్పన్నమవుతోందన్నారు.
చాలామంది సీనియర్ నేతలు పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు చెప్పారు. పార్టీలో వారికి తీరని అవమానాలు ఎదురవుతున్నాయని అన్నారు. అయితే, తనలాగా బయటకు వచ్చే శక్తి ఎంతమందికి ఉందన్న విషయాన్ని కాలమే నిర్ణయిస్తుందని పేర్కొన్న ఆయన.. తాను ఏ పార్టీలోనూ చేరకపోవచ్చని పేర్కొన్నారు.