తెలంగాణలో మరో 614 మందికి కరోనా

Telangana corona daily bulletin
  • గత 24 గంటల్లో 50,520 కరోనా పరీక్షలు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 131 కొత్త కేసులు
  • ఇంకా 9,908 మందికి చికిత్స
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 50,520 కరోనా పరీక్షలు నిర్వహించగా, 614 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో 131 కొత్త కేసులు నమోదు కాగా, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 48, రంగారెడ్డి జిల్లాలో 43, ఖమ్మం జిల్లాలో 33 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 2,387 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గడచిన ఒక్కరోజులో రాష్ట్రంలో ఎలాంటి మరణాలు సంభవించలేదు.

రాష్ట్రంలో ఇప్పటివరకు 7,84,062 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,70,047 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 9,908 మంది చికిత్స పొందుతున్నారు. తెలంగాణలో కరోనా రికవరీ రేటు 98.21 శాతంగా ఉంది.
Go Back to Shorts
Telangana
Corona Virus
Daily Bulletin
Today Cases

More Telugu News