కావ్యా మారన్.. ఐపీఎల్ వేలంలో అందరి కళ్లూ ఆమెపైనే.. గూగుల్, సోషల్ మీడియాలో ట్రెండింగ్
- నిన్న ఎస్ఆర్ హెచ్ టీంతో వేలంలో పాల్గొన్న కావ్య
- కావ్య ఎవరు? అంటూ సోషల్ మీడియాలో వెతుకులాట
- 2018లోనూ ఇలాగే వైరల్ అయిన ఎస్ఆర్ హెచ్ యజమాని
నిన్న వేలం ప్రారంభమైనప్పటి నుంచి సోషల్ మీడియాలో ఆమె గురించే చర్చ నడుస్తోంది. ఎస్ఆర్ హెచ్ డైరెక్టర్ టామ్ మూడీ, బౌలింగ్ మెంటార్ ముత్తయ్య మురళీధరన్ తో కలిసి ఆమె వేలంలో పాల్గొన్నారు. దీంతో అసలు ఆమె ఎవరు? ఎస్ఆర్హెచ్ ఓనర్ ఎవరు? అంటూ సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. గూగుల్ లో ఆమె పేరు బాగా ట్రెండ్ అయిపోయింది.
కాగా, 2018 వేలం సమయంలోనూ కావ్యా మారన్ పేరు ట్రెండ్ అయింది. అప్పట్లో ఆమెను ఎస్ఆర్ హెచ్ ఆక్షన్ గర్ల్ అంటూ ట్విట్టర్ లో వైరల్ చేశారు. ఇక తొలిసారి ఆమె 2018 సీజన్ లో కోల్ కతా నైట్ రైడర్స్ తో మ్యాచ్ సందర్భంగా ఆమె అందరికీ కనిపించారు. ప్రస్తుతం ఆమె సన్ మ్యూజిక్, సన్ టీవీకి చెందిన ఎఫ్ఎం చానెల్స్ బాధ్యతలను చూసుకుంటున్నారు.