నా బిడ్డకు తండ్రివి నువ్వేనంటూ మహిళ వేధింపులు.. పోలీసులకు ఫిర్యాదు చేసిన కర్ణాటక ఎమ్మెల్యే
- సోషల్ మీడియా ద్వారా తనపై చెడుగా ప్రచారం చేస్తోందని ఎమ్మెల్యే ఫిర్యాదు
- బిడ్డ సంరక్షణ కోసం రూ. 2 కోట్ల పరిహారం డిమాండ్ చేస్తోందని ఆరోపణ
- పోలీసులు తనను బంధించారన్న మహిళ
- న్యాయం చేయాలని వెళ్తే పోలీసులు వేధిస్తున్నారన్న ఆమ్ ఆద్మీ పార్టీ
తనపై జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేస్తానని డబ్బు, నగల కోసం వేధించిందని ఆరోపించారు. గతేడాది మార్చిలో తనను కలిసి డిమాండ్లు పరిష్కరించాలని, ఇప్పుడేమో తన బిడ్డకు నువ్వే తండ్రివని వేధిస్తూ సంరక్షణ కోసం రూ. 2 కోట్లు డిమాండ్ చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తన ప్రత్యర్థులతో చేతులు కలిపి ఆమె ఈ ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే రాజకుమార్ పాటిల్ ఆరోపించారు.
మరోవైపు, ఈ ఘటన రాజకీయంగానూ దుమారం రేపుతోంది. పోలీసులు తనను బంధించారని బాధిత మహిళ ఆరోపించగా, న్యాయం చేయాల్సిన పోలీసులే ఆమెను వేధిస్తున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. ఎమ్మెల్యే ద్వారా జరిగిన అన్యాయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా ముఖ్యమంత్రికి మొరపెట్టుకుందని, తన ప్రాణాలకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరేందుకు విధానసభ పోలీస్ స్టేషన్‌కు వెళ్తే పోలీసులు అక్కడామెను నిర్బంధించారని ఆరోపించింది. దీంతో విధిలేక ఆమె పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసిందని ఆమ్ ఆద్మీ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు కుశల స్వామి అన్నారు. రాష్ట్ర మహిళా కమిషన్, మహిళా సంఘాలు ఆమెకు అండగా నిలవాలని ఆమె కోరారు.