Hindupur: హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కనబడడం లేదని ఫిర్యాదు

Case Filed against Hindupur MLA Balakrishna and MP MLC
షార్ట్స్‌లో చూడండి
హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ కనబడడం లేదంటూ స్థానిక బీజేపీ నాయకులు నిన్న పట్టణంలోని వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా చేయాలని ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నప్పటికీ వీరిలో ఏ ఒక్కరూ స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్యే బాలకృష్ణ, ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ వెంటనే తమ పదవులకు రాజీనామా చేసి హిందూపురం కోసం జరుగుతున్న ఈ ప్రజా ఉద్యమంలో పాల్గొనాలని డిమాండ్ చేశారు.
Go Back to Shorts
Hindupur
Balakrishna
Gorantla Madhav
Shaik Mohammed Iqbal

More Telugu News