దేశంలో రెండు రోజులపాటు వర్షాలు, చలిగాలులు.. హెచ్చరించిన ఐఎండీ
- గత మూడు నాలుగు రోజులుగా వాతావరణంలో మార్పు
- మరో రెండు రోజులపాటు వణికించనున్న తీవ్ర చలిగాలులు
- జమ్మూకశ్మీర్‌లో భారీ వర్షాలు, హిమపాతానికి అవకాశం
అలాగే, 29, 31 తేదీల్లో జమ్మూకశ్మీర్, లడఖ్, గిల్గిత్, బాల్టిస్థాన్, ముజఫరాబాద్ ప్రాంతాల్లో వర్షాలతో పాటు భారీ హిమపాతానికి అవకాశముందని అధికారులు పేర్కొన్నారు. వచ్చే నెల 2వ తేదీ నుంచి 4 వరకు పశ్చిమ హిమాలయ ప్రాంతంలో తేలికపాటి నుంచి భారీ వర్షాలు, మంచు కురిసే అవకాశం ఉందని వివరించారు. తూర్పు భారతదేశంలో 2 నుంచి 4 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది.