భారీ యాక్షన్ ఎపిసోడ్ తో రంగంలోకి దిగుతున్న బాలయ్య!

Gopichand Malineni movie update
  • రాయలసీమ నేపథ్యంలో బాలయ్య సినిమా
  • వచ్చేనెల 12 నుంచి రెగ్యులర్ షూటింగ్
  • కథానాయికగా శ్రుతిహాసన్
  • ముఖ్య పాత్రల్లో అర్జున్, వరలక్ష్మి శరత్ కుమార్
బాలకృష్ణ కథానాయకుడిగా ఇటీవల వచ్చిన 'అఖండ' ఇంకా తన దూకుడు చూపుతూనే ఉంది. ఈ సినిమాతో ఆ తరువాత ఆయన చేయనున్న గోపీచంద్ మలినేని సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. అందువలన ఆయన స్క్రిప్ట్ పై మరింతగా కసరత్తు చేసి రంగంలోకి దిగుతున్నాడు. నిజానికి ఈ నెల 11 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలుకావలసి ఉంది.

కానీ కరోనా ఎఫక్ట్ కారణంగా ఆలస్యమైంది. దీంతో వచ్చేనెల 12వ తేదీ నుంచి ఫస్టు షెడ్యూల్ ను మొదలుపెట్టనున్నారు. హైదరాబాద్ .. రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ షెడ్యూల్ చిత్రీకరణ స్టార్ట్ అవుతుంది. బాలకృష్ణ తదితరులపై భారీ యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరిస్తారట. ఆ తరువాత లాంగ్ షెడ్యూల్ ను 'కడప' పరిసర ప్రాంతాల్లో ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది.

ఈ సినిమా కథా నేపథ్యం అంతా కూడా రాయలసీమలో నడుస్తుంది. 'వేటపాలెం'లో జరిగిన ఒక సంఘటన ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు. బాలకృష్ణ సరసన శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తుండగా, అర్జున్ .. వరలక్ష్మి శరత్ కుమార్ .. దునియా విజయ్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.
Go Back to Shorts
Balakrishna
Sruthi Haasan
Gopichand Malineni Movie

More Telugu News