CM Jagan: సీఎం జగన్ కార్యాలయానికి కొత్త కాంతులు... రిపబ్లిక్ డే స్పెషల్

CM Jagan camp office with lighting
మరో రెండ్రోజుల్లో భారత గణతంత్ర దినోత్సవం వస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం క్యాంపు కార్యాలయాన్ని అందంగా ముస్తాబు చేశారు. తాడేపల్లిలోని ఈ కార్యాలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. స్పెషల్ లైటింగ్ తో క్యాంపు కార్యాలయం కొత్త కాంతులు వెదజల్లుతోంది. దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి. రిపబ్లిక్ డే వేడుకల్లో సీఎం జగన్ కూడా పాల్గొననున్నారు.
CM Jagan
Camp Office
Republic Day
YSRCP

More Telugu News