ఆస్కార్ అవార్డుల బరిలో రెండు భారతీయ చిత్రాలు... కుదించిన జాబితాలో జై భీమ్, మరక్కార్

Two Indian films short listed for Oscars
ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం సమీపిస్తోంది. ప్రస్తుతం చిత్రాల పరిశీలన జరుగుతోంది. కాగా, ఆస్కార్ అవార్డుల బరిలో కుదించిన జాబితాలో రెండు భారతీయ చిత్రాలు స్థానం సంపాదించాయి. సూర్య హీరోగా నటించిన జై భీమ్, మోహన్ లాల్ నటించిన మరక్కార్ చిత్రాలు ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో పోటీకి ఎంపికయ్యాయి. ఈ రెండు చిత్రాలు దక్షిణాది సినీ పరిశ్రమ నుంచే ఆస్కార్ కు వెళ్లడం విశేషం. ఈసారి ఆస్కార్ ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో 276 సినిమాలు పోటీపడుతున్నాయి. ఆయా కేటగిరీలకు చెందిన ఫైనల్ నామినేషన్లను ఆస్కార్ కమిటీ ఫిబ్రవరి 8న ప్రకటించనుంది.
Go Back to Shorts
Oscar Awards
Jai Bheem
Marakkar
Best Foreign Movie
India

More Telugu News