తన ఫాంహౌస్ సమీపంలో ఉండే వ్యక్తిపై కోర్టులో దావా వేసిన సల్మాన్ ఖాన్
- కేతన్ కక్కడ్ అనే వ్యక్తిపై కోర్టులో కేసు
- తనను కించపరిచేలా వ్యాఖ్యలు చేశాడని ఆరోపణ
- మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోర్టుకు సల్మాన్ విజ్ఞప్తి
ఈ క్రమంలో కక్కడ్ తో పాటు మరో ఇద్దరు వ్యక్తులను, యూట్యూబ్, గూగుల్, ట్విట్టర్, ఫేస్ బుక్ వంటి మాధ్యమాలను కూడా సల్మాన్ ఈ కేసులో చేర్చారు. తనకు వ్యతిరేకంగా ఉన్న కంటెంట్ ప్రసారం కాకుండా స్టే ఇవ్వాలని, ఆయా మాధ్యమాల్లో తనను అవమానపరిచేలా ఉన్న కంటెంట్ ను తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని సల్మాన్ ఖాన్ న్యాయస్థానాన్ని కోరారు.
దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. సల్మాన్ ఆరోపణలపై బదులిచ్చేందుకు తమకు వ్యవధి కావాలంటూ కేతన్ కక్కడ్ తరఫు న్యాయవాదులు చేసిన విజ్ఞప్తికి కోర్టు సానుకూలంగా స్పందించింది.