మంచు కొండల్లో భారత సైనికుల ఖుక్రీ డ్యాన్స్... వీడియో ఇదిగో!
- ఉత్తర కశ్మీర్ లో విపరీతంగా మంచు
- క్లిష్ట పరిస్థితుల్లో విధులు నిర్వర్తిస్తున్న జవాన్లు
- కుప్వారా జిల్లాలో ఖుక్రీ విన్యాసాలు ప్రదర్శించిన వైనం
- వీడియో పంచుకున్న భారత ఆర్మీ
తాజాగా, భారత సైన్యానికి చెందిన ఓ బృందం త్రివర్ణ పతాకం ముంగిట ప్రదర్శించిన ఖుక్రీ డ్యాన్స్ వీడియో సామాజిక మాధ్యమాల్లో ఆకట్టుకుంటోంది. ఖుక్రీ అనేది ఓ వంపు తిరిగిన కత్తి. గూర్ఖా రెజిమెంట్ లో ఉండే సైనికులు తుపాకీతో పాటు దీన్ని కూడా ధరిస్తుంటారు. కాగా, సంగీతానికి అనుగుణంగా జవాన్లు ప్రదర్శించిన ఖుక్రీ విన్యాసాల వీడియోను భారత సైన్యం పంచుకుంది.