ఏపీలో కొత్తగా 166 మందికి కరోనా పాజిటివ్

AP Corona Daily Report
  • గత 24 గంటల్లో 31,844 కరోనా పరీక్షలు
  • విశాఖ జిల్లాలో 31 కొత్త కేసులు
  • రాష్ట్రంలో ఇద్దరి మృతి
  • ఇంకా 1,154 మందికి చికిత్స
ఏపీలో గడచిన 24 గంటల్లో 31,844 కరోనా శాంపిల్స్ పరీక్షించగా 166 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా విశాఖ జిల్లాలో 31 కొత్త కేసులు నమోదు కాగా... చిత్తూరు జిల్లాలో 28, కృష్ణా జిల్లాలో 21 కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా కడప, శ్రీకాకుళం జిల్లాలలో 3 కేసుల చొప్పున గుర్తించారు.

అదే సమయంలో 91 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 20,77,145 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,61,496 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 1,154 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 14,495కి పెరిగింది.
Go Back to Shorts
Andhra Pradesh
Corona Virus
Daily Report
Today Cases

More Telugu News