Andhra Pradesh: ఏపీలో మరింత తగ్గిన కరోనా రోజువారీ కేసులు... తాజా వివరాలు ఇవిగో!

AP records lowest corona positive cases
షార్ట్స్‌లో చూడండి
ఏపీలో గడచిన 24 గంటల్లో 17,940 కరోనా శాంపిల్స్ పరీక్షించగా, 54 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో 19 కొత్త కేసులు వెల్లడి కాగా, విశాఖ జిల్లాలో 13 కేసులు గుర్తించారు. అనంతపురం, కడప, ప్రకాశం, శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు.

అదే సమయంలో 121 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒక్క మరణం కూడా సంభవించలేదు. ఏపీలో ఇప్పటిదాకా 20,76,546 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,60,957 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 1,099 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 14,490 అని తాజా బులెటిన్ లో పేర్కొన్నారు.
Go Back to Shorts
Andhra Pradesh
Corona Virus
Positive Cases
Today Cases

More Telugu News