Revanth Reddy: పోలీసుల నుంచి త‌ప్పించుకుని వెళ్లేందుకు రేవంత్ రెడ్డి య‌త్నం.. అరెస్టు

revant reddy arrest
షార్ట్స్‌లో చూడండి
హైద‌రాబాద్ లోని జూబ్లీహిల్స్‌లోని టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి ఇంటి వ‌ద్ద ఉద్రిక్త‌త నెల‌కొంది. ఎర్ర‌వెల్లిలో రేవంత్ రెడ్డి ర‌చ్చ‌బండ కార్య‌క్ర‌మం త‌ల‌పెట్టిన నేప‌థ్యంలో ఆయ‌నను పోలీసులు అరెస్టు చేసి వేరే ప్రాంతానికి త‌ర‌లించారు. ఆ స‌మ‌యంలో ప‌లువురు కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు అడ్డుప‌డ‌డంతో అక్క‌డ గంద‌ర‌గోళం నెల‌కొంది. పోలీసులు, కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల మ‌ధ్య తోపులాట చోటు చేసుకుంది.

సీఎం కేసీఆర్ నివాసానికి ద‌గ్గ‌ర‌లోనే ఎర్ర‌వెల్లిలో ర‌చ్చ‌బండ కార్య‌క్ర‌మం నిర్వ‌హించి తీర‌తామ‌ని రేవంత్ రెడ్డి చెప్పిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో పోలీసుల నుంచి త‌ప్పించుకుని రేవంత్ రెడ్డి రోడ్డు మీద‌కు వ‌చ్చే ప్ర‌య‌త్నం చేయ‌డంతో ఆయ‌న‌ను పోలీసులు అరెస్టు చేశారు. అక్క‌డ ఉన్న మరికొంద‌రు కాంగ్రెస్ నాయ‌కుల‌ను కూడా పోలీసులు అరెస్టు చేస్తున్నారు.
Go Back to Shorts
Revanth Reddy
Congress
Police

More Telugu News