ఏపీలో ఆరోగ్యశ్రీ పథకంపై సులభ సమాచారం కోసం ప్రత్యేకంగా యాప్
- ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
- యాప్ తీసుకురావాలన్న సీఎం జగన్
- ఎక్కడ చికిత్స చేయించుకోవాలో తెలిపే ఏర్పాట్లు ఉండాలని సూచన
- రిఫరల్ విధానంపై దృష్టి సారించాలని అధికారులకు స్పష్టీకరణ
ఏ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ సేవలు లభిస్తాయి? రోగులు ఏ ఆసుపత్రికి వెళ్లాలి? అనే అంశాలకు యాప్ ద్వారా సరైన మార్గదర్శనం చేయాలని నిర్దేశించారు. 108 ఆసుపత్రుల్లోనూ ఇలాంటి సమాచారం ఉండాలని, 104ను కూడా ఆ మేరకు అభివృద్ధి చేయాలని స్పష్టం చేశారు.
ఆరోగ్యశ్రీ పథకంలో 'రిఫరల్' అన్నది ఎంతో కీలమైనదని, యాప్ ద్వారా దాన్ని మరింత పరిపుష్టం, సరళతరం చేయాలని సీఎం జగన్ సూచించారు. ఈ రిఫరల్ విధానానికి విలేజ్ క్లినిక్ అనేది కేంద్రంగా మారాలని అభిలషించారు. ఈ యాప్ లో రోగుల సందేహాలను నివృత్తి చేసే సదుపాయం కూడా కల్పించాలని అధికారులకు తెలిపారు. రాష్ట్రంలోని ఆరోగ్య మిత్రలకు సెల్ ఫోన్లు ఇచ్చి, అందులో ఆరోగ్యశ్రీ యాప్ పొందుపరిచే ప్రతిపాదనకు సీఎం ఆమోదం తెలిపారు.