కాంగ్రెస్ అధికారంలోకి రావడం కష్టమే: గులాం నబీ అజాద్
- 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ 300 ఎంపీ సీట్లను గెలుచుకోవడం కష్టమే
- కాంగ్రెస్ గెలుపు సాధ్యమయ్యేలా లేదు
- అందుకు ఆర్టికల్ 370 రద్దుపై హామీ ఇవ్వలేను
ఆర్టికల్ 370పై ఏన్నో ఏళ్ల నుంచి తానొక్కడినే మాట్లాడుతున్నానని... ప్రస్తుతం ఆ విషయం కోర్టు పరిధిలో ఉన్నందున తాను ఆ విషయం గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేనని గులాం నబీ అజాద్ అన్నారు. ఆర్టికల్ రద్దుపై వెనక్కి వెళ్లేందుకు బీజేపీ సిద్ధంగా లేదని... కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనే నమ్మకం లేకపోవడం వల్ల ఆర్టికల్ రద్దుపై హామీ ఇవ్వలేనని చెప్పారు. జమ్మూకశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించేందుకు కేంద్రంపై అన్ని పార్టీలు కలిసి ఒత్తిడి తీసుకురావాలని తెలిపారు.