విజయవాడలో చెడ్డీ గ్యాంగ్.. మారణాయుధాలు, కర్రలతో హల్ చల్
- గుంటుపల్లిలోని అపార్ట్ మెంట్లోకి ప్రవేశం
- ఓ ఫ్లాట్ యజమాని లైట్లు వేయడంతో పరార్
- స్థానికుల్లో భయాందోళన
- ముఠా కోసం పోలీసుల గాలింపు
చెడ్డీగ్యాంగ్ కదలికలతో పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముఠా కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా, తెలంగాణలోని హైదరాబాద్ తో పాటు పలు నగరాల్లో చెడ్డీ గ్యాంగ్ దొంగతనాలకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఆ ముఠానే విజయవాడలోనూ హల్ చల్ చేసిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.