'ఆచార్య'లో ఆ పాట .. ఐదు రోజుల జాతర: కొరటాల
- చిరూ పాటకి మంచి రెస్పాన్స్ వచ్చింది
- చరణ్ సాంగ్ కూడా దూసుకుపోతోంది
- ఇద్దరి కాంబినేషన్లో మరో సాంగ్ ఉంది
- సినిమాకి హైలైట్ అవుతుందన్న కొరటాల
"ఈ సినిమా నుంచి ఇప్పటికే రెండు పాటలు వదిలాము .. ఈ రెండు పాటలకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. చిరూ నుంచి ఒకటి .. చరణ్ నుంచి ఒక పాట బయటికి వచ్చాయి. ఇక వీళ్లిద్దరి కాంబినేషన్లో మరో పాటను చిత్రీకరించాము. ఈ సినిమా హైలైట్స్ లో ఈ పాట ఒకటిగా నిలుస్తుంది.
ఈ పాటను షూట్ చేస్తున్న విషయం తెలిసి ఒక రోజున చిరూ ఫ్యామిలీ మొత్తం సెట్ కి వచ్చింది. ఆ తరువాత రోజున చరణ్ సన్నిహితులంతా వచ్చారు. మరుసటి రోజున ఇండస్ట్రీలోని దర్శక నిర్మాతలంతా వచ్చారు. ఇలా 5 రోజుల పాటు సెట్లో జాతర వాతావరణం కనిపించింది. మణిశర్మ స్వరపరిచిన ఈ పాటకి శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీని అందించాడు" అని చెప్పుకొచ్చారు.