ప్రముఖ నటి సూర్యకాంతం పేరిట ప్రత్యేక కవరు రూపొందించిన పోస్టల్ శాఖ
- గయ్యాళి పాత్రలకు పెట్టింది పేరు
- సహజ నటనతో రాణింపు
- కాకినాడలో పోస్టల్ కవరు ఆవిష్కరణ
- ఈ నెల 18న కార్యక్రమం
ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో సూర్యకాంతం స్వస్థలం కాకినాడలో జరుగుతుందని కాకినాడ డివిజన్ పోస్టల్ సూపరింటిండెంట్ నాగేశ్వర్ రెడ్డి వెల్లడించారు. ఈ కార్యక్రమానికి వైసీపీ ఎంపీ వంగా గీత, స్థానిక ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, నగర మేయర్ శివ ప్రసన్న, విశాఖ రీజియన్ పోస్టుమాస్టర్ జనరల్ ఎం.వెంకటేశ్వర్లు హాజరుకానున్నారు.