Vijay Devarakonda: అమెరికా వెళుతున్న 'లైగర్'

  • ముగింపు దశలో 'లైగర్'
  • బాక్సర్ గా విజయ్ దేవరకొండ
  • టాలీవుడ్ కి అనన్య పాండే 
  • పాన్ ఇండియా స్థాయి రిలీజ్   
Liger movie updare

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'లైగర్' సినిమా రూపొందుతోంది. పూరి స్పీడ్ కి ఈ సినిమా ఈపాటికి ప్రేక్షకుల ముందుకు వచ్చేది. కానీ కరోనా కారణంగా షూటింగుకు అంతరాయం కలుగుతూ వచ్చింది. దాంతో వాయిదాలు వేసుకుంటూనే చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది.

తాజా షెడ్యూల్ ను అమెరికాలో ప్లాన్ చేశారు. ఈ నెల 12వ తేదీన ఈ సినిమా టీమ్ అమెరికా వెళుతోంది. ఈ విషయాన్ని నిన్న వైజాగ్ లో జరిగిన 'పుష్పక విమానం' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ స్వయంగా చెప్పాడు. అంతేకాదు తాను నిర్మించిన ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లే బాధ్యత అభిమానులదేనని అన్నాడు.

ఈ సినిమాలో విజయ్ దేవరకొండ బాక్సర్ గా కనిపించనున్నాడు. ఆయన జోడీగా అనన్య పాండే తెలుగు తెరకు పరిచయమవుతోంది. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాతో తన కెరియర్ నెక్స్ట్ లెవెల్ కి వెళుతుందనే నమ్మకంతో విజయ్ దేవరకొండ ఉన్నాడు. ఏం జరుగుతుందో చూడాలి మరి.

More Telugu News