CM KCR: ఈ నెల 10న వరంగల్, హన్మకొండ జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటన ఖరారు

  • పలు అభివృద్ధి పనుల పరిశీలన
  • రింగ్ రోడ్లు, టెక్స్ టైల్ పార్కు సందర్శన
  • అధికారులతో సమీక్షించనున్న సీఎం
  • ట్విట్టర్ లో వెల్లడించిన సీఎంవో
CM KCR will visit development works in Warangal and Hanmakonda districts

తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ నెల 10న వరంగల్, హన్మకొండ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ రెండు జిల్లాల్లో పలు అభివృద్ధి పనులను పరిశీలించి, సమీక్ష చేపడతారు. వరంగల్ దక్షిణ భాగంలో ఔటర్ రింగ్ రోడ్డు, వరంగల్ జిల్లాలోని ఇతర మున్సిపాలిటీల్లో రోడ్ల అభివృద్ధి పనులు, వరంగల్-హన్మకొండ జంటనగరాల్లో రైల్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం, వరంగల్ ఇంటర్నల్ రింగ్ రోడ్డు, వరంగల్ టెక్స్ టైల్ పార్కు పనులను పరిశీలించి అధికారులకు తగు సూచనలు ఇవ్వనున్నారు. ఇప్పటివరకు జరిగిన పనులపై సమీక్ష నిర్వహిస్తారు. ఈ మేరకు ముఖ్యమంత్రి పర్యటన ఖరారైనట్టు సీఎంవో వెల్లడించింది.

More Telugu News