ఏపీ కరోనా రోజువారీ కేసుల వివరాలు ఇవిగో!
- గత 24 గంటల్లో 23,824 కరోనా పరీక్షలు
- 150 మందికి పాజిటివ్
- గుంటూరు జిల్లాలో 28 కొత్త కేసులు
- రాష్ట్రంలో ముగ్గురి మృతి
- ఇంకా 3,760 మందికి చికిత్స
అదే సమయంలో 217 మంది కరోనా నుంచి కోలుకోగా, ముగ్గురు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,67,706 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,49,555 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,760 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 14,391కి పెరిగింది.