Taapsee: ఓ స్టార్ హీరో నాతో నటించడానికి ఇష్టపడలేదు: తాప్సీ

One star hero not liked to act with me says Taapsee
షార్ట్స్‌లో చూడండి
హీరోయిన్లకు పేరు వచ్చే సినిమాల్లో నటించేందుకు చాలా మంది హీరోలు ఇష్టపడరని నటి తాప్సీ తెలిపింది. సినిమాల్లో పురుషాధిక్యత గురించి ఆమె మాట్లాడుతూ... ఒక సినిమాలో తనది డబుల్ రోల్ అని... ఆ సినిమాలో హీరో పాత్ర కోసం ఒక టాప్ యాక్టర్ ను నిర్మాతలు సంప్రదించారని... అయితే సదరు హీరో ఒప్పుకోలేదని చెప్పింది.

వాస్తవానికి ఆయన తనతో అంతకు ముందే ఒక సినిమాలో నటించాడని తెలిపింది. ఆయన పెద్ద స్టార్ అని... అయినా తనతో నటించడానికి ఆయన అభద్రతగా ఫీల్ కావడం బాధాకరమని వ్యాఖ్యానించింది. ఒకట్రెండు సినిమాలు చేసిన హీరోలు కూడా ఆ పాత్ర చేయడానికి ఒప్పుకోలేదని చెప్పింది. ప్రేక్షకుల మార్కులు హీరోయిన్ పాత్రకు పడతాయనే వారు ఆ సినిమా చేయడానికి ఇష్టపడలేదని తెలిపింది.
Go Back to Shorts
Taapsee
Tollywood
Hero

More Telugu News