ఏపీలో మరో 220 మందికి కరోనా పాజిటివ్

AP Covid Media Report
  • గత 24 గంటల్లో 25,532 కరోనా పరీక్షలు
  • తూర్పు గోదావరి జిల్లాలో 51 కేసులు
  • రాష్ట్రంలో నలుగురి మృతి
  • ఇంకా 4,142 మందికి చికిత్స
ఏపీలో గడచిన 24 గంటల్లో 25,532 కరోనా పరీక్షలు నిర్వహించగా, 220 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 51 కొత్త కేసులు వెల్లడి కాగా, చిత్తూరు జిల్లాలో 33 కేసులు గుర్తించారు. కర్నూలు, విజయనగరం జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 429 మంది కరోనా నుంచి కోలుకోగా, నలుగురు మరణించారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు 20,66,670 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,48,151 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,142 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 14,377కి పెరిగింది.
Go Back to Shorts
Andhra Pradesh
Corona Virus
Media Report
Today Cases

More Telugu News