పెంపుడు శునకం చనిపోవడంతో కన్నీటి పర్యంతమైన కొండా సురేఖ

Konda Surekha lost her pet dog
  • విషాదంలో కొండా సురేఖ
  • పెంపుడు శునకం సోనూ మృత్యువాత
  • భోరున విలపించిన కొండా సురేఖ
  • సామాజిక మాధ్యమాల్లో వీడియో
మాజీ మంత్రి కొండా సురేఖ తన పెంపుడు శునకం సోనూ మరణించడం పట్ల విషాదానికి లోనయ్యారు. పెంపుడు కుక్కకు కన్నీటి నివాళులు అర్పించారు. తమ కుటుంబంలో కలిసిపోయిన శునకం మృత్యువాతపడడంతో కొండా సురేఖ వేదన వర్ణనాతీతం. ఓ కుటుంబ సభ్యుడు దూరమైనంతగా ఆమె రోదించడం చూపరులను కలచివేసింది. దాన్ని ఒళ్లోకి తీసుకుని ఆమె భోరున విలపించారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తోంది.
Go Back to Shorts
Konda Surekha
Pet Dog
Sonu
Death

More Telugu News