పవన్ సరసన సాక్షి వైద్య అలా ఛాన్స్ కొట్టేసిందట!

Surendar Reddy New Movie Update
  • షూటింగు దశలో అఖిల్ 'ఏజెంట్'
  • కథానాయికగా సాక్షి వైద్య పరిచయం
  • సురేందర్ రెడ్డి నెక్స్ట్ మూవీ పవన్ తో
  • సాక్షివైద్యను సిఫార్స్ చేసిన సురేందర్ రెడ్డి
  • పవన్ నుంచి వచ్చిన గ్రీన్ సిగ్నల్  
వచ్చే ఏడాదిలో టాలీవుడ్ కి పరిచయం కానున్న కథానాయికల జాబితాలో ముఖ్యంగా సంయుక్త మీనన్ .. మీనాక్షి చౌదరి పేర్లు  వినిపిస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలో సాక్షి చౌదరి పేరు కూడా చేరిపోయింది. ప్రస్తుతం సాక్షి చౌదరి .. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'ఏజెంట్' సినిమా చేస్తోంది. చాలామంది కథానాయికల మాదిరిగానే ఈ బ్యూటీ మోడలింగ్ నుంచి వచ్చింది.

అఖిల్ హీరోగా 'ఏజెంట్' సినిమా రూపొందుతూ ఉండగానే, ఈ సుందరి పవన్ కల్యాణ్ సరసన ఛాన్స్ దక్కించుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. సురేందర్ రెడ్డి తన తదుపరి సినిమాను పవన్ కల్యాణ్ తోనే చేయనున్నాడు. సాక్షి వైద్య పనితీరు నచ్చిన కారణంగా, ఆమెని హీరోయిన్ గా పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి, పవన్ తో ఓకే అనిపించుకున్నాడట.

అలా సురేందర్ రెడ్డి సిఫార్స్ తోనే ఈ మహారాష్ట్ర సుందరి పవన్ సినిమాలో అవకాశాన్ని దక్కించుకుందని అంటున్నారు. ఇక ప్రస్తుతం 'భీమ్లా నాయక్' సినిమాను చేస్తున్న పవన్, ఆ తరువాత 'హరిహర వీరమల్లు' పూర్తి చేయనున్నాడు. ఈ రెండు ప్రాజెక్టుల తరువాత హరీశ్ శంకర్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నాడు. అది పూర్తయిన తరువాతనే సురేందర్ రెడ్డితో సినిమా మొదలవుతుంది
Go Back to Shorts
Pavan Kalyan
Sakshi Vaidya
Surendar Reddy

More Telugu News