'వరుడు కావలెను' నుంచి రేపు లిరికల్ సాంగ్ రిలీజ్!
- ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా 'వరుడు కావలెను'
- దర్శకురాలిగా లక్ష్మీసౌజన్య
- కీలకమైన పాత్రలో నదియా
- అక్టోబర్ 15వ తేదీన విడుదల
ఈ సినిమాకి సంగీత దర్శకులుగా తమన్ - విశాల్ చంద్రశేఖర్ పనిచేశారు. ఈ సినిమా నుంచి ఈ మధ్య వదిలిన 'దిగు దిగు దిగు నాగ' అనే పాట బాగా పాప్యులర్ అయింది. ఈ నేపథ్యంలో మరో లిరికల్ వీడియో సాంగ్ ను వదలడానికి ఈ సినిమా టీమ్ ముహూర్తాన్ని ఖరారు చేసింది.
రేపు ఉదయం 10:08 నిమిషాలకు ఈ సినిమా నుంచి ఈ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ .. ట్రైలర్ .. సాంగ్స్ అంచనాలు పెంచేస్తున్నాయి. నదియా .. మురళీ శర్మ .. వెన్నెల కిషోర్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా, దసరాకి ఏ రేంజ్ లో సందడి చేస్తుందో చూడాలి.