Corona Virus: ఏపీలో మరో 1,365 మందికి కరోనా పాజిటివ్

Corona positive for another 1365 people in AP
షార్ట్స్‌లో చూడండి
ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 56,720 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,365 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 212 కొత్త కేసులు నమోదు కాగా, తూర్పు గోదావరి జిల్లాలో 210, ప్రకాశం జిల్లాలో 166, పశ్చిమ గోదావరి జిల్లాలో 157, వైఎస్సార్ కడప జిల్లాలో 153, నెల్లూరు జిల్లాలో 137, గుంటూరు జిల్లాలో 131, కృష్ణా జిల్లాలో 104 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 1 కేసు నమోదయింది.

అదే సమయంలో 1,466 మంది కరోనా నుంచి కోలుకోగా, 8 మంది మృత్యువాతపడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,42,073 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,14,180 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఏపీలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 13,796గా ఉంది. కరోనా మృతుల సంఖ్య 14,097కి పెరిగింది.

Go Back to Shorts
Corona Virus
Andhra Pradesh

More Telugu News