Andhra Pradesh: ఏపీలో కొత్తగా 839 మందికి కరోనా పాజిటివ్

AP Corona cases and deaths
షార్ట్స్‌లో చూడండి
ఏపీలో గత 24 గంటల్లో  42,679 కరోనా పరీక్షలు నిర్వహించగా, 839 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 231 కొత్త కేసులు వెల్లడి కాగా, నెల్లూరు జిల్లాలో 149, చిత్తూరు జిల్లాలో 101, ప్రకాశం జిల్లాలో 101 కేసులు నమోదయ్యాయి. విజయనగరం జిల్లాలో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అనంతపురం జిల్లాలో 1, కర్నూలు జిల్లాలో 4, శ్రీకాకుళం జిల్లాలో 5 కేసులు గుర్తించారు.

అదే సమయంలో 1,142 మంది కరోనా నుంచి కోలుకోగా, 8 మంది మృత్యువాతపడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,39,529 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,11,063 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 14,388 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 14,078కి పెరిగింది.
Go Back to Shorts
Andhra Pradesh
Corona Virus
New Cases
Deaths
Today Cases

More Telugu News