Corona Virus: దేశంలో క‌రోనా కేసుల అప్‌డేట్స్‌

  • నిన్న కొత్తగా 34,403 క‌రోనా కేసులు
  • కేసుల సంఖ్య మొత్తం 3,33,81,728
  • నిన్న 320 మంది మృతి
  • మొత్తం మృతుల సంఖ్య  4,44,248
corona bulletin in inida

దేశంలో నిన్న కొత్తగా 34,403 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్ర‌క‌టించింది. దీంతో దేశంలో క‌రోనా కేసుల సంఖ్య మొత్తం 3,33,81,728కి చేరింది. అలాగే, నిన్న 37,950 మంది కోలుకున్నార‌ని పేర్కొంది. దేశంలో క‌రోనాతో మ‌రో 320 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 4,44,248కి పెరిగింది.  

ఇక క‌రోనా నుంచి ఇప్ప‌టివ‌ర‌కు 3,25,98,424 మంది కోలుకున్నారు. ప్ర‌స్తుతం 3,39,056 మందికి ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్‌ల‌లో చికిత్స అందుతోంది. నిన్న దేశంలో 67,43,775 వ్యాక్సిన్ డోసుల‌ను ప్ర‌జ‌ల‌కు వేశారు. దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 77.24 కోట్ల‌ డోసుల వ్యాక్సిన్లు వినియోగించారు.

More Telugu News