హైదరాబాద్‌లో మరో దారుణ ఘటన.. బాలిక అనుమానాస్పద మృతి
- మియాపూర్‌లో ఘటన
- నిన్న 13 నెలల పాప అదృశ్యం
- కళ్లు పీకేసి చంపేసిన వైనం
- 12 ఏళ్ల బాలుడిపై తల్లిదండ్రుల ఆరోపణలు
తల్లిదండ్రులు తిరిగి ఇంటికి వచ్చేసరికి బాలిక కనిపించలేదు. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాలిక మృతిపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఆ పాప మృతదేహం ఇంటి సమీపంలో ఖాళీ స్థలంలో కనపడింది. ఆ పాప కళ్లు పొడిచి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
కాగా, తల్లిదండ్రులు చెబుతోన్న వివరాల్లో స్పష్టత లేదని పోలీసులు అంటున్నారు. తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి ప్రశ్నిస్తున్నారు. ఓ గుర్తు తెలియని 12 ఏళ్ల బాలుడు నిన్న సాయంత్రం తమ పాపను తీసుకెళ్లినట్లు తల్లిదండ్రులు పోలీసులకు చెప్పారు. అనంతరం ఆ బాలుడు కూడా అదృశ్యమైనట్లు తెలుస్తోంది. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. బాలిక మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు.