సీనియర్ల పట్ల గౌరవభావం కలిగిన వ్యక్తి సాయిధరమ్ తేజ్: విజయశాంతి
- సాయితేజ్ చాలా మంచివాడు
- మంచి టాలెంట్ ఉన్న నటుడు
- సాయితేజ్ త్వరగా కోలుకోవాలి
తాజాగా సీనియర్ నటి, బీజేపీ నాయకురాలు విజయశాంతి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. సాయి త్వరగా కోలుకోవాలని ఆమె ఆకాంక్షించారు. సాయితేజ్ చాలా మంచి వ్యక్తి అని కితాబునిచ్చారు. మంచి ప్రవర్తన, సీనియర్ల పట్ల గౌరవభావం కలిగిన వ్యక్తి అని ప్రశంసించారు. మంచి టాలెంట్ ఉన్న నటుడని అన్నారు. సాయితేజ్ త్వరగా కోలుకుని, ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందించాలని భగవంతుడిని కోరుకుంటున్నానని చెప్పారు.