నటుడు సాయిధరమ్ తేజ్ ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ ఇదిగో
- కాలర్ బోన్ విరగడం మినహా అంతర్గతంగా ఎలాంటి గాయాలు లేవన్న వైద్యులు
- మరో 48 గంటలు వైద్యుల పర్యవేక్షణలోనే
- రేపు మాట్లాడే అవకాశం ఉందన్న వైద్యులు
సాయి తేజ్ పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. సాయి మద్యం తాగి డ్రైవ్ చేయలేదని, ప్రమాద సమయంలో హెల్మెట్ ధరించే ఉన్నాడని పేర్కొన్నారు. రోడ్డుపై ఇసుక ఉండడంతో బండి జారి ప్రమాదం జరిగిందని వివరించారు. అల్లు అరవింద్ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. సాయితేజ్ సేఫ్‌గానే ఉన్నాడని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.