సాయిబాబా విగ్రహం నుంచి విభూది.. వీడియోలో వెల్లడించిన బిగ్‌బాస్ ఫేం

Big Boss fame revealed in video Vibhudi from Sai Baba statue
  • నటి హిమజ ఇంట్లో అద్భుతం
  • స్వయంగా వెల్లడించిన బిగ్‌బాస్ ఫేం
  • పలు సీరియళ్లలో నటించిన యాక్టర్
  • ఎవర్నీ నమ్మించడానికి కాదని స్పష్టత
  • తన అనుభూతిని మాత్రమే పంచుకుంటున్నట్లు వెల్లడి
బిగ్‌బాస్ ఫేం, నటి హిమజ.. తన ఇంట్లో అద్భుతం జరిగిందంటూ తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. తమ ఇంట్లో ఉన్న ఒక సాయిబాబా విగ్రహం నుంచి విభూది రాలుతోందని హిమజ వెల్లడించింది. అలాగే బాబా విగ్రహం ముందు ఉంచిన నీరు తులసి వాసన వస్తోందని తెలిపింది.

ఈ విగ్రహం తాను ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల నుంచి ఇంట్లో ఉన్నట్లు చెప్పిన ఆమె.. 2004లో రమణానంద స్వామీజి తమ ఇంట్లో బాబాకి 19 రోజుల హోమం చేసినట్లు గుర్తుచేసుకుంది. అప్పటి నుంచి ఈ సాయిబాబా విగ్రహం తుడవడం, ఆ విగ్రహం ముందున్న నీటిని మార్చడం తన దినచర్యగా మారినట్లు ఆమె చెప్పింది. ఈ క్రమంలో తాజాగా విగ్రహం తుడవడానికి వెళ్తే.. దాని చుట్టూ విభూది కనిపించిందని ఆమె వెల్లడించింది.

ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ సీరియల్ నటి.. తాను ఎవర్నీ నమ్మించడానికి వీడియో చేయడం లేదని స్పష్టం చేసింది. ఇలాంటివి జీవితంలో అనుభవంలోకి వస్తేనే ఎవరికైనా తెలుస్తుందన్న ఆమె.. తన అనుభూతిని చెప్పుకోవడానికి మాత్రమే వీడియో చేసినట్లు వివరించింది. పలు టీవీ సీరియల్స్‌లో నటించిన హిమజ చాలా మందికి సుపరిచితురాలే. అయితే బిగ్‌బాస్‌లో పాల్గొన్న తర్వాత ఆమె పాపులారిటీ మరింత పెరిగింది.

    ఫేస్ బుక్ వీడియో   
Go Back to Shorts
Himajha
Sai Baba statue
Vibhudi

More Telugu News