Akhil: దసరా బరిలోకి 'బ్యాచ్ లర్' .. రిలీజ్ డేట్ ఖరారు!

  • అఖిల్ తాజా చిత్రంగా 'బ్యాచ్ లర్'
  • రొమాంటిక్ లవ్ స్టోరీగా సాగే కథ 
  • గోపీసుందర్ సంగీతం ప్రత్యేక ఆకర్షణ 
  • అక్టోబర్ 8వ తేదీన విడుదల  
Most Eligible Bachlor movie release at Dasara

అఖిల్ హీరోగా 'బొమ్మరిల్లు' భాస్కర్ దర్శకత్వంలో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' సినిమా రూపొందింది. బన్నీవాసు నిర్మించిన ఈ సినిమా, ఈ పాటికే విడుదల కావలసింది. కానీ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వలన, వెయిట్ చేస్తూ వచ్చారు.

ఈ సినిమాను దసరా రోజుల్లో అక్టోబర్ 12వ తేదీన విడుదల చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి. కానీ ఈ సినిమాను అక్టోబర్ 8వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడిస్తూ రిలీజ్ డేట్ తో కూడిన ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. పూజ హెగ్డే కథానాయికగా నటించిన ఈ సినిమాలో, ఈషా రెబ్బా మరో కథానాయికగా అలరించనుంది. ఆమని ... మురళీశర్మ .. వెన్నెల కిషోర్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.

గోపీ సుందర్ నుంచి వచ్చిన పాటలకి ఇప్పటికే మంచి ఆదరణ లభించింది. ఈ సినిమాకి ఆయన బాణీలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని అంటున్నారు. ఈ సినిమాతో తనకి తప్పకుండా హిట్ పడుతుందనే నమ్మకంతో అఖిల్ ఉన్నాడు. ఇక ఇదే రోజున వైష్ణవ్ తేజ్ 'కొండపొలం' విడుదలవుతున్న సంగతి తెలిసిందే.

More Telugu News