Corona Virus: దేశంలో కొత్త‌గా 46,164 క‌రోనా కేసుల న‌మోదు

corona bulletin in inida
షార్ట్స్‌లో చూడండి
దేశంలో నిన్న 46,164 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,25,58,530కు చేరింది. అలాగే నిన్న క‌రోనా నుంచి 34,159 మంది కోలుకోగా, 607 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య మొత్తం 4,36,365కు పెరిగింది.

దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,17,88,440 మంది కోలుకున్నారు. 3,33,725 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. అలాగే, దేశంలో నిన్న 80,40,407 వ్యాక్సిన్ డోసులు వేయగా, ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 60,38,46,475 డోసుల వ్యాక్సిన్లు వేసినట్టు అధికారులు ప్ర‌క‌టించారు.
Go Back to Shorts
Corona Virus
COVID19
India

More Telugu News