Corona Virus: దేశంలో క‌రోనా కేసుల తాజా వివ‌రాలు

corona bulletin in inida
  • నిన్న 37,593 కేసులు
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,25,12,366
  • నిన్న 648 మంది మృతి
  • మృతుల సంఖ్య మొత్తం 4,35,758
దేశంలో నిన్న 37,593 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,25,12,366కు చేరింది. అలాగే నిన్న క‌రోనా నుంచి 34,169 మంది కోలుకోగా, 648  మంది మృతి చెందారు. మృతుల సంఖ్య మొత్తం 4,35,758కు పెరిగింది.

దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,17,54,281 మంది కోలుకున్నారు. 3,22,327 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. అలాగే, దేశంలో నిన్న 61,90,930 వ్యాక్సిన్ డోసులు వేయగా, ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 59,55,04,593 డోసుల వ్యాక్సిన్లు వేసినట్టు అధికారులు ప్ర‌క‌టించారు.

More Telugu News

Corona Virus
COVID19
India