Corona Virus: దేశంలో రెండు నెల‌ల్లో తార‌స్థాయికి క‌రోనా మూడో ద‌శ విజృంభ‌ణ‌: నిపుణుల క‌మిటీ నివేదిక‌

nidm report on corona third wave
షార్ట్స్‌లో చూడండి
క‌రోనా మూడో ద‌శపై కేంద్ర ప్ర‌భుత్వానికి జాతీయ విప‌త్తుల నిర్వ‌హ‌ణ సంస్థ నివేదిక ఇచ్చి ప‌లు హెచ్చ‌రిక‌లు చేసింది. భార‌త్‌లో క‌రోనా మూడో ద‌శ ముప్పు స‌మీపంలోనే ఉంద‌ని తెలిపింది. అక్టోబ‌రులో ఈ విజృంభ‌ణ తార‌స్థాయికి చేరుకునే ప్ర‌మాదం ఉంద‌ని వివ‌రించింది. ఈ మేర‌కు నిపుణుల క‌మిటీ నివేదిక‌ను జాతీయ విప‌త్తుల నిర్వ‌హ‌ణ సంస్థ ప్ర‌ధాన మంత్రి కార్యాల‌యానికి స‌మ‌ర్పించింది.

క‌రోనా మూడో ద‌శ విజృంభ‌ణ వ‌స్తే ప్ర‌స్తుతం ఉన్న వైద్య స‌దుపాయాలు ఏ మాత్రం స‌రిపోవ‌ని హెచ్చ‌రించింది. చిన్న పిల్ల‌ల‌కు వైద్యం కోసం వైద్యులు, ఇత‌ర వైద్య సిబ్బందిని పెంచాల‌ని చెప్పింది. వెంటిలేట‌ర్లు, అంబులెన్సుల సంఖ్య‌ను పెంచాల్సిన అవ‌స‌రం ఉంద‌ని చెప్పింది.
Go Back to Shorts
Corona Virus
COVID19
India

More Telugu News