పూజ హెగ్డేపై రోజా భర్త ఆర్కే సెల్వమణి విమర్శలు
- పూజ వల్ల నిర్మాతలకు ఆర్థిక భారం పెరుగుతోంది
- స్టార్ డమ్ రాగానే పూజ మారిపోయింది
- తన వెంట 12 మంది అసిస్టెంట్లను వెంట పెట్టుకొస్తోంది
స్టార్ డమ్ రాగానే పూజ ఎంతో మారిపోయిందని ఆయన అన్నారు. ఆమె వల్ల నిర్మాతకు ఆర్థిక భారం పెరుగుతోందని చెప్పారు. తొలి నాళ్లలో పూజ తన వెంట ఒక అసిస్టెంట్ ను తీసుకొచ్చేదని... షూటింగ్ సమయంలో డ్రెస్సింగ్, మేకప్, ఇతర అవసరాలను అతనే చూసుకునేవాడని సెల్వమణి తెలిపారు. ఇప్పుడు ఏకంగా 12 మంది అసిస్టెంట్లను వెంట పెట్టుకుని షూటింగులకు వస్తోందని... దీనివల్ల నిర్మాతలపై ఆర్థిక భారం పడుతోందని విమర్శించారు. ఇంతమంది అసిస్టెంట్ల అవసరం ఏముందో తనకు అర్థం కావడం లేదని అన్నారు.
ప్రస్తుతం పూజ చేతిలో నాలుగు ప్రాజెక్టులు ఉన్నాయి. ప్రభాస్ తో కలిసి నటించిన 'రాధేశ్యామ్' త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తమిళంలో విజయ్ సినిమా 'బీస్ట్'లో కథానాయికగా ఎంపికయింది. బాలీవుడ్ లో సల్మాన్ సరసన 'కబీ ఈద్ కబీ దివాలి', రణ్ వీర్ సరసన 'సర్కస్' సినిమాల్లో నటిస్తోంది.