ఆఫ్ఘనిస్థాన్‌లో బయటకు వస్తోన్న ప్రజలు.. మళ్లీ కళకళలాడుతోన్న మార్కెట్లు.. ఐస్‌క్రీములు తిన్న తాలిబన్లు
- ఆఫ్ఘన్‌లో సాధారణ పరిస్థితులు?
- క్రమంగా తెరుచుకుంటోన్న దుకాణాలు
- రోడ్లపై మళ్లీ రద్దీ
మార్కెట్లలోకి జనాలు వస్తున్నారు.. రోడ్లపై మళ్లీ రద్దీ పెరిగింది. ప్రజలు మళ్లీ తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. ప్రజలు నిత్యావసర సరుకులు కొనుగోలు చేసేందుకు దుకాణాలకు వెళ్తున్నారు. కాబుల్‌లోని బర్డ్ స్ట్రీట్‌లో చాలా మంది కనపడ్డారు. ఓ ప్రాంతంలోని దుకాణంలో తాలిబన్ ఉగ్రవాదులు ఐస్‌క్రీమ్ లు తింటూ కనిపించారు.