ఖతర్‌ను వీడి.. ఆఫ్ఘనిస్థాన్‌కు పయనమైన తాలిబన్ అగ్రనేత!
- ఖతర్ మంత్రితో బరాదర్ సమావేశం
- ఆఫ్ఘన్‌లో తాజా పరిస్థితులు, అధికార మార్పిడిపై చర్చ
- తాలిబన్లు ఆప్ఘన్‌ను స్వాధీనం చేసుకోవడం వెనక బరాదర్ వ్యూహం
తాలిబన్ సహ వ్యవస్థాపకుడైన ముల్లా 'దోహా శాంతి' ఒప్పందంలో కీలక పాత్ర పోషించాడు. ఆఫ్ఘన్ నుంచి అమెరికా వెళ్లిపోయిన తర్వాత తాలిబన్లు విరుచుకుపడి ఒక్కో రాష్ట్రాన్ని స్వాధీనం చేసుకుంటూ ముందుకు సాగడం వెనక ఆయన వ్యూహం ఉండొచ్చని భావిస్తున్నారు. ఇప్పుడు ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ల వశం కావడంతో ఇన్నాళ్లూ ఖతర్‌లో ఉన్న ముల్లా ఇప్పుడు ఆఫ్ఘనిస్థాన్‌కు బయలుదేరినట్టు చెబుతున్నారు.