Whatsapp: వ్యాక్సిన్ సర్టిఫికెట్ కావాలా?.. 90131 51515 నంబరుకు వాట్సాప్ చేస్తే సరి!

Vaccine certificate on whatsapp
  • వాట్సాప్ నంబరు అందుబాటులోకి
  • ‘కొవిడ్ సర్టిఫికెట్’ అని మెసేజ్ చేస్తే సరి
  • అందుబాటులోకి తెచ్చిన కేంద్రం
కరోనా టీకా వేయించుకున్న వారు సర్టిఫికెట్ డౌన్‌లోడ్ కోసం ఇక ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. ఎంచక్కా వాట్సాప్ ద్వారా దానిని డౌన్‌లోడ్ చేసుకునే వెసులుబాటు అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం వ్యాక్సిన్ సర్టిఫికెట్ కావాలంటే కొవిన్ యాప్‌లోకి వెళ్లి నంబరు టైప్ చేసి, ఓటీపీ వచ్చిన తర్వాత దానిని ఎంటర్ చేస్తేనే సర్టిఫికెట్ డౌన్‌లోడ్ సాధ్యమయ్యేది.

అయితే, ఇప్పుడు వాట్సాప్ ద్వారా క్షణాల్లో సర్టిఫికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇందుకోసం చేయాల్సిందల్లా.. 90131 51515 నంబరును ఫోన్‌లో సేవ్ చేసుకోవడమే. ఆ తర్వాత ఆ నంబరుకు ‘కొవిడ్ సర్టిఫికెట్’ అని ఇంగిష్‌లో టైప్ చేసి పంపిస్తే సరి. క్షణాల్లోనే అది మన వాట్సాప్‌కు వచ్చేస్తోందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
Whatsapp
Vaccine Certificate
Corona Virus

More Telugu News