vc: నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా నియ‌మించారంటూ పిటిష‌న్.. తెలుగు, కాక‌తీయ‌ వ‌ర్సిటీల వీసీల‌కు హైకోర్టు నోటీసులు

  • ఇటీవ‌లే వైస్ చాన్స‌ల‌ర్‌ల నియామ‌కం
  •  కాక‌తీయ వ‌ర్సిటీ వీసీకి పదేళ్ల అనుభవం లేదని పిటిష‌న్
  • తెలుగు విశ్వ‌విద్యాల‌య వీసీ వ‌య‌సు 70 ఏళ్లు దాటింద‌ని అభ్యంత‌రం
  • నాలుగు వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలంటూ నోటీసులు  
high court sends notice to vcs

తెలంగాణ‌లోని విశ్వ విద్యాల‌యాల‌కు ఇటీవ‌ల వైస్ చాన్స‌ల‌ర్‌ల‌ను నియ‌మించిన విష‌యం తెలిసిందే. అయితే, కొంద‌రు వీసీలను నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా నియ‌మించారంటూ విశ్రాంత ప్రిన్సిపల్‌ విద్యాసాగర్‌ దాఖలు చేసిన పిటిష‌న్‌పై ఈ రోజు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమా కోహ్లి, జస్టిస్‌ విజయ్‌సేన్‌రెడ్డి ధర్మాసనం విచారణ జ‌రిపింది. కాకతీయ, తెలుగు యూనివర్సిటీ వీసీలకు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని పేర్కొంది.

ఆ రెండు వ‌ర్సిటీల‌ వీసీల నియామకం నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా జ‌రిగింద‌ని పిటిష‌న‌ర్ త‌రఫు న్యాయ‌వాది ఆరోపించారు. కాక‌తీయ వ‌ర్సిటీ వీసీకి పదేళ్ల అనుభవం లేదని తెలిపారు. అలాగే, తెలుగు విశ్వ‌విద్యాల‌య వీసీ వ‌య‌సు 70 ఏళ్లు దాటింద‌ని వివ‌రించారు. ఈ నేప‌థ్యంలో దీనిపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం, యూజీసీని కూడా హైకోర్టు ఆదేశించింది.

More Telugu News