సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- పూజ హెగ్డేకు నచ్చిన ప్రేమకథ
- పాటలకు రెడీ అవుతున్న రవితేజ
- ఓటీటీ కోసం నాగ చైతన్య సినిమా
* రవితేజ హీరోగా రమేశ్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఖిలాడి' చిత్రానికి సంబంధించిన రెండు పాటల చిత్రీకరణ వచ్చే నెల మొదటి వారం నుంచి జరుగుతుంది. మొదట్లో ఈ పాటలను దుబాయ్ లో చిత్రీకరించాలని ప్లాన్ చేశారు. అయితే, వీసా సమస్యల వల్ల ఆ ఆలోచనను విరమించుకుని, హైదరాబాదులోనే సెట్స్ లో చిత్రీకరించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
* అక్కినేని నాగ చైతన్య తొలిసారిగా ఓటీటీ కోసం ఓ చిత్రాన్ని చేస్తున్నాడు. దీనిని శరత్ మరార్ నిర్మిస్తారు. ప్రస్తుతం స్క్రిప్ట్ పని జరుగుతోంది. త్వరలోనే దర్శకుడిని ఎంపిక చేస్తారు. ఇదిలా ఉంచితే, చైతూ ప్రస్తుతం తెలుగులో 'థ్యాంక్యూ', 'బంగార్రాజు' సినిమాలతో పాటు హిందీలో 'లాల్ సింగ్ చద్దా' చిత్రాన్ని చేస్తున్నాడు.