Rashi Khanna: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • తమిళ సినిమా సీక్వెల్ లో రాశిఖన్నా 
  • ఎమ్మెస్ రాజు '7 డేస్ 6 నైట్స్' అప్ డేట్
  • మరోసారి మోహన్ లాల్ తో మీనా  
Rashi Khanna joins song shoot for a Tamil movie

*  ప్రస్తుతం తెలుగులో 'పక్కా కమర్షియల్', 'థ్యాంక్యూ' సినిమాలలో నటిస్తున్న కథానాయిక రాశిఖన్నా తాజాగా తమిళంలో మరో చిత్రంలో నటిస్తోంది. ప్రముఖ దర్శకుడు సుందర్ సి దర్శకత్వంలో రూపొందుతున్న 'అరణ్మణై 3' చిత్రంలో రాశి నాయికగా నటిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ఓ పాటను చెన్నైలో హీరో ఆర్య, హీరోయిన్ రాశిఖన్నాలపై చిత్రీకరిస్తున్నారు.
*  ఆమధ్య 'డర్టీ హరీ' చిత్రానికి దర్శకత్వం వహించిన ప్రముఖ నిర్మాత ఎమ్మెస్ రాజు తాజాగా రూపొందిఉస్తున్న చిత్రం '7 డేస్ 6 నైట్స్'. సుమంత్ అశ్విన్, మెహర్ చావల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ అరవై శాతం పూర్తయిందని, మరో షెడ్యూలుతో మొత్తం పూర్తవుతుందని దర్శకుడు ఎమ్మెస్ రాజు తెలిపారు.  
*  ఇటీవల 'దృశ్యం 2' మలయాళ చిత్రంలో మోహన్ లాల్ సరసన నటించిన ప్రముఖ నటి మీనా ఆయనతో మరోసారి నటిస్తోంది. పృథ్వీరాజ్ దర్శకత్వంలో మోహన్ లాల్ హీరోగా  రూపొందుతున్న 'బ్రో డాడీ' చిత్రంలో మీనా నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాదులో జరుగుతోంది.

More Telugu News